ఎన్నాళ్లిలా డోలీ కష్టాలు..!

Dec 18,2023 10:35 #Dolly

 

నిత్యం అవస్థలు పడుతున్న గిరిజనులు…పట్టించుకోని పాలకులు, అధికారులు

ప్రజాశక్తి-అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : మారుమూల గిరిజన గ్రామాల గిరిజనులకు డోలి కష్టాలు తప్పలేదు. సరైన రోడ్డు సౌకర్యాలు లేక పోవడంతో వైద్య సేవలు అందక గిరిజన రోగులు మృత్యువాతకు గురవుతున్న ఘటనలు జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ రాసకిలం గ్రామానికి చెందిన సూకురు బాబురావు గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ప్రధమ చికిత్స నిమిత్తం దుప్పటి డోలి కట్టి గ్రామం నుండి ఏడు కిలోమీటర్లు కొండకోనల నడుమ నుండి పిన్నకోట ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రిఫర్‌ చేశారు. అక్కడ నుండి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా పిన్నకోట ,పెద్దకోట, జీన్నబడు పంచాయతీ పరిధి మారుమూల గ్రామాలకు రోడ్డు లేక గిరిజనులు అనారోగ్యం పాలైనప్పుడు డోలీలోనే తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు

➡️