పెరుగుతున్న కుక్కకాటు కేసులు 

Jan 1,2024 10:44 #Dog Bite
dog-bite-cases-double-in-3-years-36-cases

 

  • ఏడాదిలో ఆరు లక్షల కేసుల పెరుగుదల

న్యూఢిల్లీ : దేశంలో కుక్కకాటు కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2022తో పోలిస్తే 2023లో దాదాపు ఆరు లక్షల కేసులు పెరిగాయి. కుక్కకాటుకు గురైన వారిలో రాబిస్‌ వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అధికంగా ఉంటోంది. 2030 నాటికి దేశంలో రాబిస్‌ పూర్తిగా నిర్మూలించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కన్పించడం లేదు. రాబిస్‌ను సమూలంగా నిర్మూలించే విషయంపై గత నెలలో నీతి ఆయోగ్‌ జాతీయ స్థాయిలో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. వ్యాధి కారణంగా చోటుచేసుకుంటున్న మరణాలపై ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.డిసెంబర్‌ ప్రారంభం నాటికి దేశంలో మొత్తం 27.5 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. 2022లో వచ్చిన 21.8 లక్షల కేసులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కుక్కకాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారిలో 96% మరణాలకు రాబిస్‌ వ్యాధే కారణమని అధికారులు చెబుతున్నారు. 2015లో దేశంలో రాబిస్‌ కారణంగా 20,847 మంది చనిపోయారు. ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే ఈ సంఖ్య బాగా ఎక్కువ. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 60 వేల మంది నయం చేయడానికి వీలుకాని వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు, ఆరోగ్య సిబ్బందిలో అవగాహన లేకపోవడంతో రోగులకు సకాలంలో చికిత్స అందించలేకపోతున్నారు.

➡️