ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులను అనుమతించొద్దు

Feb 16,2024 09:20 #AP High Court, #DSC 2024
Do not allow BED candidates for SGT posts

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఇచ్చిన డిఎస్‌సి నోటిఫికేషన్‌లో సెకెండ్రీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జిటి) పోస్టుల భర్తీకి బిఇడి అభ్యర్థులను అనుతించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అద్దంకి పట్టణానికి చెందిన బొల్లా సురేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌లను చేర్చారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని, రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ (ఆర్‌టిఇ) చట్టంలోని సెక్షన్‌ 23ను ఉల్లంఘనగా ఉందన్నారు. ఈ నెల 8న ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్‌ వెలువడిందని, టెట్‌ నిర్వహణ తర్వాత మార్చి 15 నుంచి డిఎస్‌సి నిర్వహిస్తారని తెలిపారు. 19 రోజులు సమయం మాత్రమే ఉందన్నారు. నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు.

➡️