ఎపి భవన్‌ విభజన

Mar 17,2024 08:16 #AP Bhavan, #Division, #Telangana
  • ఎపికి 11 ఎకరాలు
  • తెలంగాణకి 8 ఎకరాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ విభజన పీటముడి ఎట్టకేలకు వీడింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య భవన్‌ ఆస్తులను విభజిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు 11.536 ఎకరాలు కేటాయించగా, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించింది. ఎపికి కేటాయించిన 11.536 ఎకరాల్లో 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్‌, స్వర్ణముఖి బ్లాక్‌, నర్సింగ్‌ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 8.245 ఎకరాల్లో శబరి బ్లాక్‌లో 3 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.

➡️