ట్రాఫిక్ తలనొప్పిగా మారిన డివైడర్లు

Feb 6,2024 23:24

ప్రజాశక్తి – చీరాల
పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన రహదారి కూడలైన మసీద్ సెంటర్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్లు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూన్నాయని, అధికారులు వెంటనే డివైడర్లను తొలగించి ట్రాఫిక్ నియంత్రించాలని ఆ ప్రాంత వ్యాపారులు కమిషనర్ విజయ సారధికి వినతి పత్రం అందజేశారు. ఏరియా వైదశాల, కళాశాలలు, స్కూల్స్‌, ప్రైవేట్ హాస్పిటల్స్, పట్టణంలోకి వచ్చేందుకు ప్రజలందరకి ప్రధాన మార్గం కావడంతో వాహనాలన్నీ అదే రోడ్డులో వస్తున్నాయని అన్నారు. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మసీదు సెంటర్ నుండి గడియార స్తంభం వరకు రోడ్డు వెడల్పు 27అడుగులు ఉండగా మధ్యలో డివైడర్లను ఏర్పాటు చేయటం, కాలువ ఉండటం వలన 10అడుగుల రోడ్డు మాత్రమే ఉంటుందని దీంతో బస్సు, అంబులెన్స్‌లు, ఇతర పెద్ద వాహనాలు, ఆగిన సమయంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. దీనివలన రోడ్డు ఇరువైపులా ఉన్న దుకాణాలకు వినియోగదారులు ఎవరూ రావడం లేదని, దీంతో వ్యాపారాలు చేయలేక పోతున్నాముంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కావున డివైడర్లను తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కమిషనర్ విజయ సారథి, డిఎస్పీ, సిఐ కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేశారు.

➡️