కోటిపల్లి శివరాత్రికి పోటెత్తిన భక్తులు

Mar 8,2024 15:49 #Konaseema
Devotees flock to Kotipalli Shivaratri
  • లక్షకు పైగా పుణ్య స్నానాలు
    ద్రాక్షారామంలో కిటకిటలాడిన భీమేశ్వరాలయం
    మంత్రి వేణు, ఎమ్మెల్సీ తోట, పిల్లి సూర్యప్రకాష్ ప్రత్యేక పూజలు

ప్రజాశక్తి-రామచంద్రపురం : మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోటిపల్లిలో తెల్లవారుజాము 5 గంటల నుండి గౌతమి గోదావరిలో లక్షకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, వైసిపి ఇన్చార్జి పిల్లి సూర్యప్రకాష్, రామచంద్రపురం ఆర్టీవో సుధా సాగర్ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటిపల్లి పైడా వారి సత్రంలో, శాలివాహన సత్రం, వెల్ల భక్త సమాజం, వంటే పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కోటిపల్లి రేవులో పప్పుల శ్రీనుబాబు ఆధ్వర్యంలో పులిహార మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. డీఎస్పీ బి రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షించారు. ద్రాక్షారామంలో ఆలయ ఈవో పి. తారకేశ్వరరావు, కోటిపల్లిలో ఆలయవ శ్రీదేవిలు మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ను పర్యవేక్షించారు.

➡️