Delhi High Court : కేజ్రీవాల్‌ను సిఎంగా తొలగించాలంటూ మరో పిల్‌

న్యూఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో మరో పిల్‌ దాఖలైంది. మాజీ ఆప్‌ మంత్రి సందీప్‌ కుమార్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆయనను సిఎం పదవి నుండి తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లలో ఇది మూడవది.
కేజ్రీవాల్‌ జైలులో ఉ్ననందున విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్‌ 14లోని సబ్‌సెక్షన్‌ (4)కి నిబంధన ప్రకారం, 239 ఎఎ (4), 167 (బి), (సి) ప్రకారం రాజ్యాంగ విధులను నిర్వర్తించే సామర్థ్యం ఆయనకు లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జైలులో ఉన్నప్పుడు ఢిల్లీ చట్టం, 1991లోని సెక్షన్‌ 45 (సి)కి సమానమైన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 167 (సి) ప్రకారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆయన రాజ్యాంగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం రిట్‌ ఆఫ్‌ కో వారెంట్‌ కోసం ఈ పిటిషన్‌ అని పిల్‌లో పేర్కొన్నారు.

➡️