ED custody : జైలు నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశం

Mar 26,2024 23:45 #Arvind Kejriwal, #ED custody

మొహల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులలో మందులు, రోగ నిర్ధారణ పరీక్షల కొరత పరిష్కరించాలి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి ఇడి కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జారీ చేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇడి, కాగితాలు, కంప్యూటర్‌ను తాము సమకూర్చలేదని, అవి ఆయనకు ఎలా వచ్చాయో చెప్పాలంటూ మంత్రి అతిషిని ప్రశ్నించింది. తదుపరి చర్యలకు ఇడి సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ రెండో ఆదేశం జారీ చేయడం దేశ రాజకీయాల్లో మరింత వేడి పెంచేసింది. మొదటి ఆదేశంలో నీరు, మురుగు సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించాలని మంత్రి అతిషిని కేజ్రీవాల్‌ ఆదేశించగా.. రెండో ఆదేశంలో మొహల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులలో మందులు, రోగ నిర్ధారణ పరీక్షల కొరతను పరిష్కరించాలని ఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌కు ఆదేశాలు జారీ చేశారు. కేజ్రీవాల్‌ ఇడి కస్టడీలో ఉన్నప్పటికీ ఆయన ఢిల్లీ ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారని మంత్రి భరద్వాజ్‌ అన్నారు. మొహల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులలో మందులు అందుబాటులో లేవని తెలుసుకున్న సిఎం ఈ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

➡️