కూటమి కుట్రలను తిప్పికొట్టండి : వైసిపి

Apr 18,2024 21:29

ఎన్నికల ప్రచారంలో వైసిపి నాయకులు

                      కదిరి టౌన్‌ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, అభ్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్‌ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కదిరి పట్టణంలోని నాలుగో వార్డులో కౌన్సిలర్‌ కృపాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్బూల్‌ మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డికి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేనితనంతో ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు పేలుతున్నాయని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నారని వాటిని తిప్పి కొట్టాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, మాజీ సమన్వయకర్త ఎస్‌ఎండి ఇస్మాయిల్‌, వైసిపి బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల హరిప్రసాద్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తల వెంకటరమణ, యువ నాయకుడు ప్రణీత్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అజ్జుకుంట రాజశేఖర్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు జిలాన్‌ భాషా, వైస్‌ చైర్‌పర్సన్‌ కొమ్ము గంగాదేవి శంకర్‌, లీగల్‌ సెల్‌ జోనల్‌ ఇంచార్జ్‌ లింగాల లోకేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓబుళదేవర చెరువు : రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుఉంటేనే వైసిపికి ఓటు వేయాలని ఆపార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఒడిసి మండలం లోని ఇనగలూరు పంచాయతీలో రామిరెడ్డి పల్లి ,శెట్టి వారి పల్లి, బోడేద్దులవారి పల్లి, తదుపరి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పల్లె రఘునాథ్‌ రెడ్డి ప్రజలకు మంచి చేసింది శూన్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ రాజు నాయుడు, టౌన్‌ కన్వీనర్‌ కోళ్ల కష్ణారెడ్డి, నాయకులు తుమ్మల షామీర్‌ భాష, జడ్పిటిసి కుర్లి దామోదర్‌ రెడ్డి. సర్పంచ్‌ చిట్వేలు బాబా ఫక్రుద్దీన్‌, గోవిందు, జగన్‌ మోహన్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కొత్తచెరువు రూరల్‌ : మండల పరిధిలోని వంగంపల్లి, ఇరుగంపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో వైసిపి నాయకులు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి బావమరిది రాఘవరెడ్డి కొత్తచెరువు మండల అబ్జర్వర్‌ అవుటాల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిశీలకుడు ఆవుటల రమణారెడ్డి పుట్టపర్తి ఎంపీపీ రమణారెడ్డి, జడ్పిటిసి గంగాదేవి, సర్పంచులు శ్రీనివాసులు, సంజీవ రాయుడు, నాగభూషణం, సాంబశివరెడ్డి, కృష్ణారెడ్డి,మటన్‌ శంకర. దాల్‌ మిల్లు సూరి తదితరులు పాల్గొన్నారు.

➡️