పశువుల దాణా పంపిణీ

Dec 17,2023 15:37 #East Godavari
dana distribution

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా): మిచ్చాంగ్ తుఫాన్ ప్రభావంతో పంటలు పశుగ్రాసం దెబ్బతిని పశు గ్రాసం దొరకక ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు ముక్కామల ఖండవల్లి గ్రామాలలో పశు వైద్యశాలల వద్ద సంపూర్ణ సమీకృత దాణ పంపిణి కార్యక్రమం ఆదివారం ఎంపీపీ కార్చేర్ల సీతారాం ప్రసాద్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణ చేతుల మీదగా పాడి రైతులకు అందజేశారు ఒక్కొక్క రైతుకు 50 కేజీలు ప్రభుత్వం సరఫరా చేసిన సంపూర్ణ మిశ్రమ దాణ ఉచితంగా రైతులకు పంపిణీ చేశారు అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ పాడి రైతులు రోజువారి వేసే పశుగ్రాసం పచ్చగడ్డి ఎండుగడ్డి తుఫాన్ ప్రభావం దొరకక ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నరు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారన్నారు దీనివలన పాడి రైతులకు కొంత ఉపశమనం కలుగుతుందన్నారు ఎంపీపీ కార్చెర్ల సీతారాంప్రసాద్ మాట్లాడుతూ తుఫాను ప్రభావితం ప్రాంతాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు పశు వైద్యులు అందించిన సేవలు ప్రశంసనీయమని తుఫాను సమయంలో వెంటనే స్పందించి పలు సేవలు అందించారని వైద్యులను ప్రశంసించారు పెరవలి వెటర్నరీ హాస్పిటల్ వైద్యుడు వానపల్లి చరణ్ ఫణీంద్ర మాట్లాడుతూ ఒక్కొక్క రైతుకు 50 కేజీలు చొప్పున పశువుల దాన అందిస్తున్నామని ఈ దానాను రోజుకు ఐదు కేజీలు వంతున 10 రోజులపాటు తమ పశువులకు అందించవచ్చును పాడి పశువులకు పాల ఉత్పత్తి పెరుగుతుందని పాడి రైతులకు సూచించారు ఖండవల్లి గ్రామంలో సుమారు మూడు లక్షల రూపాయలు విలువ చేసే 16 టన్నుల పశువుల దాణ పాడి రైతులు 320 మందికి ముక్కామల గ్రామంలో 1,66,000 రూపాయల విలువచేసే పశువుల దాణ పాడి రైతులు 180 మంది కి స్వయంగా అందజేయడం జరిగిందన్నారు

➡️