అనుమానాస్పద స్థితిలో దళిత యువకుడు మృతి

Dec 25,2023 15:01 #East Godavari, #Hatya
  • హత్య? ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు

ప్రజాశక్తి- కొవ్వూరు, చాగల్లు : ఓ దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి శివారులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… వ్యవసాయ కూలి పనులు చేసుకునే జొన్నకూటి విజయేంద్ర, ఇంద్ర చాగల్లు మండలం చంద్రవరం నుంచి వలస వచ్చి కొవ్వూరు మండలం వాడపల్లిలో ఉంటున్నారు. తాపీ పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్న వారి నాల్గో కుమారుడు జొన్నకూటి లక్ష్మణ్‌ (23) ఆదివారం సాయంత్రం బయలు చంద్రవరంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. రాత్రి పది గంటల వరకూ స్నేహితులతో గడిపారు. ఆయన సోదరుడు కిషోర్‌ ఫోన్‌ చేయడంతో కాసేపట్లో బయలుదేరి వస్తానని చెప్పారు. ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు తిరిగి ఫోన్‌ చేసినా అందుబాటులోకి రాలేదు. సోమవారం ఉదయం వాడపల్లిలోని మద్ది సత్యనారాయణ పొలంలో విగత జీవిగా లక్ష్మణ్‌ పడి ఉన్నారు. ఆయన ద్విచక్ర వాహనం పొలం గట్టుపై పడిపోయి కన్పిం చింది. లక్ష్మణ్‌ మేనమామ ఆనంద్‌కు పొలం యజమాని తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపిం చారు. పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించారు. పోలీసు జాగిలం సమీ పంలో పాకవద్దకు వెళ్లి ఆగింది. పోలీసులు ఈ పాకలో మద్యం సీసాలను గుర్తించారు. మద్యం సేవించింది ఎవరనేదీ విచారణ చేశారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. లక్ష్మణ్‌ సోదరుడి ఫిర్యాదు మేరకు ఆరుగురు అనుమానితులను గుర్తించారు. ఇది హత్య? ప్రమాదమా? అనే కోణంలో విచారణ చేపట్టారు. కొవ్వూరు సిఐ జగదీశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబానికి కెవిపిఎస్‌ పరామర్శఘటనా స్థలానికి సోమవారం వచ్చిన కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఎస్‌సి కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అనుమానితులపై ఫిర్యాదు చేయాలని సూచించారు.

➡️