చుక్కల భూముల తొలగింపు చేపట్టండి

Nov 23,2023 08:06 #Assigned Lands, #Dotted Lands
dotted-lands-in-ap

ఉత్తర్వులు జారీ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ, భూ యజమానులకు యాజమాన్యపు హక్కులు కల్పిస్తున్న నేపథ్యంలో 22(ఎ)లో చుక్కల భూముల కింద నమోదైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సిసిఎల్‌ఎ అడిషనల్‌ సెక్రటరీ ఎఎండి ఇంతియాజ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పలు సూచనలు చేశారు. చట్టంలోని సెక్షన్‌ 4(1) కిందకు వచ్చే చుక్కల భూములన్నీ రిజిస్ట్రేషన్‌ చట్టం 1908లోని 22(ఎ)(1) (బి) కింద ఉంచాలని, చట్టంలోని సెక్షన్‌ 4(2) కేటగిరి కిందకు వచ్చే అన్ని చుక్కల భూములు రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని 22(ఎ)(1)(బి) కింద ఉంచాలని పేర్కొన్నారు. అన్ని చుక్కల భూములు 9/77 చట్టంలోని నిబంధనలకు లోబడి, అసైన్‌మెంట్‌ విషయంలో రిజిస్ట్రేషన్‌ చట్టం 1908లోని (22(ఎ)(1)(ఎ) కింద ఉంచబడతాయన్నారు. చట్టంలోని సెక్షన్‌ 4(3) చుక్కల భూముల చట్టం-2017లోని నిబంధనల మేరకు రికార్డుల సంతృప్తికి లోబడి మిగిలిన భూములు 22(ఎ) నుంచి తొలగించాలని సూచించారు.

➡️