21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన డిఎంకె, మేనిఫెస్టో విడుదల

Mar 20,2024 11:17 #DMK, #M.K. Stalin, #Tamil Nadu CM

చెన్నై  :    తమిళనాడులో అధికార డిఎంకె అభ్యర్థుల జాబితా, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొదటి దశ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 39 స్థానాలకు గాను డిఎంకె 21 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.  సీట్ల ఒప్పందంలో భాగంగా మిగిలిన 18 స్థానాలను డిఎంకె, కాంగ్రెస్‌, వామపక్షాలు, విసికె తదితర మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయి.

డిఎంకె నుండి బరిలోకి దిగనున్న 21 మందిలో 11 మంది కొత్తవారు ఉండగా, దక్షిణ చెన్నై సిట్టింగ్‌ ఎంపి తమిజాచి తంగపాండియన్‌ సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపిలు కనిమొళి, టి.ఆర్‌ బాలు, ఎ. రాజా సహా దయానిధి మారన్‌, ఎస్‌.జగద్రక్షకన్‌, కళానిధి వీరసామి, కథిర్‌ ఆనంద్‌, సి.ఎన్‌. అన్నాదురైలో పోటీ చేయనున్నారు.

ఈ సందర్భగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ.. ఎల్‌పిజి సిలిండర్‌ ధరను రూ.500కు తగ్గిస్తామన్నారు. లీటర్‌ పెట్రోల్‌ రూ.75కి, డీజిల్‌ రూ.65కి తగ్గిస్తామని  ప్రకటించారు. అలాగే 100 రోజుల ఉపాధిని 150 రోజులకు పెంచుతామన్నారు. విద్యార్థుల ఎడ్యుకేషన్‌ లోన్స్‌ను మాఫీ చేస్తామని, విద్యార్థులకు వడ్డీలేకుండా  రూ.4 లక్షల  వరకు రుణాలను  ఇస్తామని ప్రకటించారు.

➡️