మంత్రి పదవుల కోసం నేతల ప్రయత్నాలు

Dec 7,2023 08:16 #Congress
dk shivakumar on cm candidate

డికె శివకుమార్‌ను కలిసిన శ్రీధర్‌ బాబు, ప్రేమ్‌సాగర్‌, మల్‌ రెడ్డి
ఇకపై అన్నీ అధిష్టానమే చూస్తోందన్న డికె శివకుమార్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది స్పష్టత వచ్చిన నేపథ్యంలో మంత్రి వర్గంలో చోటు కోసం నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. తమకు అవకాశం కల్పించాలని పట్టున్న కీలక నేతల ద్వారా విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సిఎం పదవి కోసం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ఇప్పటికే అగ్రనేతలను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఢిల్లీలో ఎఐసిసి పరిశీలకుడు డికె శివకుమార్‌ను కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు శ్రీధర్‌ బాబు, ప్రేమ్‌ సాగర్‌, మల్‌ రెడ్డి రంగారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మంత్రివర్గంలో కీలకశాఖ కేటాయించాలని కోరినట్లు తెలిసింది. డికె శివకుమార్‌తో భేటీ తరువాత శ్రీధర్‌ బాబు మీడియాతో మాట్లాడారు. పార్టీ ముఖ్య నేతలను కలిసేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. అందులో భాగంగా శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీలో సీనియర్‌గా ఉన్న తనకు మంత్రి కేటాయించాలని కోరినట్లు ప్రేమ్‌ సాగర్‌ వెల్లడించారు. మరోవైపు గడ్డం వినోద్‌ సైతం తనకు మంత్రి పదవి ఇవ్వాలని, అగ్ర నేతలు సోనియా గాంధీ, కెసి వేణుగోపాల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

నా చేతిలో ఏమీ లేదు..: డికె

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో హైకమాండ్‌ తనకు పరిశీలకుడుగా బాధ్యతలు అప్పగించిందని డికె శివకుమార్‌ అన్నారు. ఆ దిశలో సిఎల్‌పి నిర్ణయాన్ని హైకమాండ్‌కు అందించినట్లు చెప్పారు. ఈ రిపోర్టు ఆధారంగా అధిష్టానం సిఎం ఎంపికపై నిర్ణయం తీసుకుందన్నారు. అధిష్టానానికి అన్ని అంశాలనూ వివరించానని, ఇకపై అన్ని నిర్ణయాలనూ అధిష్టానమే

➡️