బిజెపి కూటమిని రానున్న ఎన్నికలలో ఓడించాలి : డి.రమాదేవి

ప్రజాశక్తి-పర్చూరు(బాపట్ల) : దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించటమే కాక ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి బిజెపి కూటమిని రానున్న ఎన్నికలలో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి పిలుపునిచ్చారు. సిపిఎం పర్చూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నాయకులు కందిమల్ల రామకోటేశ్వరావు అధ్యక్షతన ఆదివారం శాతవాహన స్కూల్లో జరిగింది. రమాదేవి మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న టిడిపి జనసేన వైసీపీలను ఓడించి ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు. విభజన చట్ట ప్రకారము అమలు చేయాల్సి నా అంశాలను పూర్తి చేయకుండా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేశారని దూయబట్టారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దానికి నిధులు కేటాయించడంలో అలసత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడమే కాక విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటానికి పూనుకోవటం వంటి అన్యాయాన్ని ఆంధ్ర రాష్ట్రానికి బిజెపి చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించకపోగా బిజెపికి మద్దతు వత్తాసు పలికి రాష్ట్రానికి మరోమారు అన్యాయం చేయాలనే చూస్తున్న ప్రాంతీయ పార్టీలకు ప్రజలు ఓట్లు వేస్తే భవిష్యత్తు అంధకార బంధురం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జరుగబోవు ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక పార్టీలు కూటమిగా ఏర్పడి పనిచేస్తున్నాయని వాటికి మద్దతునిచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం సిపిఎం మాత్రమే చేస్తుందని ప్రజా ఉద్యమాన్ని బలపరిచి సిపిఎం కు మద్దతుగా నిలవాలన్నారు. సీనియర్ నాయకులు కందిమల్ల రామకోటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించడానికి సిపిఎం ను మరియు ఇండియా వేదికను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ భక్తుల హనుమంతరావు బండి శంకరయ్య కే శ్రీనివాసరావు జి ప్రతాప్ నాగన్న వెంకటరావు ఆరు మండలాల్లోని సిపిఎం సభ్యులు అభిమానులు నాయకులు, పాల్గొన్నారు.

➡️