వి.ఐ.లెనిన్‌ శత వర్ధంతి – ‘ఆట-పాట-మాట'(ఫోటోలు)

Feb 4,2024 13:36 #Lenin centenary meeting, #Sneha
cultural programs on lenin 100th death anniversary

సోషలిస్ట్‌ వ్యవస్థాపకులు, మహోన్నత నేత వి.ఐ.లెనిన్‌ శత వర్ధంతి సందర్భంగా విజయవాడ లెనిన్‌ సెంటర్లో జనవరి 21 నుండి 27వ తేదీ వరకూ సాంస్కృతిక వారోత్సవాలు జరిగాయి. మార్క్స్‌, ఎంగెల్స్‌ – లెనిన్‌ విగ్రహాల కమిటీ, లెనిన్‌ శత వర్థంతి కమిటీ ఆధ్వర్యాన ఈ వారం రోజులూ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు ప్రతిరోజూ పలు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. ‘ఆట-పాట-మాట’ పేరుతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతోపాటు కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి ఆధ్వర్యాన నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఆలోచనాత్మకంగా సాగాయి. కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఉర్రూతలూగించాయి. అలాగే ఎర్రజెండా గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కళాకారుల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. లెనిన్‌ సెంటర్‌కు కొత్త సందడిని తెచ్చిపెట్టాయి. ఎంతో ప్రేరణ కలిగించిన ప్రదర్శనలను ప్రజలు విశేషంగా ఆదరించారు.

 

– ఎం.బి. నాథన్‌

➡️