అడుగంటిన బోర్లు..ఎండుతున్న పంటలు

వర్షం కురవడకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడిగింటిపోయి బోరు బావుల పూర్తిగా ఇంకిపోయయి. మండుతున్న ఎండలు, వడగాలులతో పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ప్రత్యామ్నాయ మార్గాలు దొరకక కష్టం నేలపాలు అవుతుండడంతో, రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆర్థికంగా మోస్తరు పరిస్థితుల్లో ఉన్న రైతులు మాత్రం వేల రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా పంటల తడుపుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారులి.ప్రజాశక్తి-కలికిరి పశ్చిమ మండలాలలో రైతులు ఎక్కువగా వరి, వేరుశనగ, టమోటా పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ పంటలపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టి చేస్తుంటారు. ప్రత్యేకంగా రబీ సీజన్లో వరితోపాటు టమోటా, వేరుశనగ ఎక్కువగా పండిస్తుంటారు. ప్రస్తుతం మండలంలో 737 ఎకరాల్లో వరి, 356 ఎకరాల్లో వేరుశనగ, 166 ఎకరాల్లో టమోటా సాగును చేస్తున్నారు. గత నవంబర్‌, డిసెంబర్‌ మాసంలో పూర్తిగా వర్షాలు పడకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయి బోరు బావుల్లో సైతం నీళ్లు రాకపోవడంతో ఎన్ను బారే సమయంలో వరి పంటలకు సరిపడ నీరు సరిపోక తడులు పడే పరిస్థితి రావడంతో వరి పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. టమోటా, బొప్పాయి పంటలు కూడా కొంతమంది రైతులు పండిస్తుండడంతో నీళ్లు చాలక ఆ పంటలను కూడా వదిలేసుకునే పరిస్థితి నెలకొన్నది. లక్షలకు లక్షలు పెట్టి పంటలు చేసి తీరా ఒబిడి చేసుకునే సమయంలో నీటి కొరతతో పంటలు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న రైతులు డబ్బులు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తడిపి పంటను ఒబిడి చేసుకునే దానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఎక్కువ ఖర్చు అవుతుండడంతో పెట్టుబడి కూడా రాక రైతుల తీవ్ర నష్టాల్లో కూరుకు పోతున్నారు. బోర్లకు రూ.10 లక్షలు ఖర్చు చేశా నేను ఎకరా వరిమడి, మూడు ఎకరాలు బొప్పాయి తోట వేశాను. గత నెలలో బోరులో నీరు తగ్గిపోవడంతో పంటలకు నీళ్లు చాలక కొత్త బోర్‌ వేసాను దాంట్లో కూడా రెండు రోజులు వచ్చిన తర్వాత రాకపో వడంతో మళ్లీ బోరు వేయడంతో సుమారు పది లక్షల ఖర్చు అయింది. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. లేకపోతే లక్షల ఖర్చులు పెట్టి పంటలు వేయడానికి రైతులు ముందుకు రారు.- పి.నరసింహులు, రైతు, కె.బర్నేపల్లి.నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి వర్షాలు లేకపోవడంతో బోరు బావుల్లో పూర్తిగా నీళ్లు ఇంకిపోయి పంటలు ఎండిపోతున్నాయి. తిరిగి కొత్త బోర్లు వేయాలంటే నీళ్లు పడతాయో పడవో బోర్లు వేయడానికి లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఆర్థికంగా దివాలా తీస్తున్నాం. ప్రభుత్వం ఫ్రీ బోర్లు వేయిస్తామని చెప్పింది. ఆ పథకం అందరికీ అమలు కాలేదు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.- కె.శ్రీనివాసులు, కూకటి గొల్లపల్లి.

➡️