విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు

Nov 18,2023 15:49 #Anantapuram District, #Crop Damage

వ్యవసాయానికి 7 గంటలే
ప్రజాశక్తి-బొమ్మనహాల్ : బొమ్మనహాల్ మండలంలోని గోవిందవాడ ఉప్పరాల బొమ్మనహల్ గ్రామాల నందు గల 33 విద్యుత్ సబ్స్టేషన్ నుండి 50 గ్రామాలకు వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వాటిని అమలు చేయడంలో విద్యుత్ శాఖ విఫలమైందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నందు వర్షాలు లేక బోరు బావుల పై ఆధారపడి జీవిస్తున్న రైతులు కొత్తూరు ఖానాపురం ఎలెంజ్ మైలాపురం కొలగానహళ్లి నెమకల్ దర్గా వన్నూరు కలవల తిప్ప బొల్లనగుడ్డం సిద్ధరాంపురం సింగేపల్లి గ్రామాలకు విద్యుత్ తొమ్మిది గంటలు వ్యవసాయానికి అందరి ద్రాక్షలా మిగిలిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు షిట్లుగా ఒక్కొక్క సబ్సిడీ ఐదు ఫీడర్లకు టైం ప్రకారం రాత్రి వేళా ఐదు గంటలు పగటివేలు నాలుగు గంటలు విద్యుత్ వ్యవసాయానికి అందించాలని స్పష్టమైన జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు ఉన్న స్థానిక సిబ్బంది అమలు చేయకపోవడంతో అరకురువా నీరంది వరి పంట పత్తి పంట మిరప పంట విద్యుత్ పై ఆధారపడిన రైతులు కష్టాలు వండనీయతంగా మారాయని స్థానిక రైతులు అన్నారు. 30 వేల రూపాయలు ఎకరాకు కవులు చెల్లించి మిరప నారు నాటు చేసి పెట్టుబడి పెట్టి బోరు బావుల్లో నీరున్న విద్యుత్ కోతల్లో రైతులు అల్లాడుతున్నామని స్థానికులు ఆపోయారు విద్యుత్ వ్యవసాయానికి అందించే సమయంలో ఎక్కువ ఎల్సిలు తీసుకోవడం సిబ్బంది రైతులతో అన్యోన్యత లేకపోవడం గంటలు తరబడి ఎల్సీలు ఇవ్వడం మధ్యలో లైన్ క్లియరెన్స్ కాకపోవడం విద్యుత్ ఫీల్డ్ సిబ్బంది అప్రమత్తం కాకపోవడం వల్ల మోటార్ల సక్రమంగా ఆడక  పెట్టిన పంట చేతికి అందుతుందో లేదో అని రైతుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

➡️