కాంగ్రెస్‌పై విమర్శలు అర్ధరహితం

Mar 12,2024 00:01

ప్రజాశక్తి – చీరాల
కాంగ్రెస్‌పై సిఎం వైఎస్‌ జగన్‌ విమర్శలు చేయడం అర్ధరహితమని కాంగ్రెస్‌ నాయకులు నీలం శ్యామ్యేల్‌ మోజెస్‌ పేర్కొన్నారు. స్థానిక ముంతావారి సెంటర్లోని శ్రీనివాస అకాడమీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపీ నిన్నటి సిద్ధం సభలో సిఎం వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన వారు, నోట కంటే తక్కువ ఓట్లు వచ్చినవాళ్లు, సైన్యం లేని సైన్యాధిపతులని విమర్శచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనలు అనేక రాష్ట్రాల్లో జరిగినాయని అన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను బట్టి జరిగినవే తప్ప ప్రత్యేకంగా అన్యాయం చేయాలని ఏ పార్టీ కోరుకోదని అన్నారు. దాని వలన కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. కాంగ్రెస్‌కు సాంప్రదాయకంగా వస్తున్న దళిత, క్రైస్తవ, మైనార్టీ, బిసి ఓట్లు కోలిపోయిందని అన్నారు. అది మీకు బదిలీ అయిందని గుర్తు చేశారు. మీరు ఐదేళ్లల్లో చేసిన నిర్వాకం వలన మరల ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ఆస్థి అని అన్నారు. రాజశేఖరరెడ్డి పేరు, కాంగ్రెస్ పేరు వైసిపిలో ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. వైసిపి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని సిఎంపై ఆరోపణలు చేశారు. స్పెషల్ కేటగిరి స్టేటస్ తుంగలో తొక్కారని, సిపిఎస్ రద్దు చేస్తానన్న హామీ ప్రకారం రద్దు చేశారా? అని ప్రశ్నించారు. 2019లో పూర్తి మధ్య నిషేధం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి, రద్దు చేస్తేనే 2024 ఎన్నికల్లో పాల్గొంటానని చెప్పిన జగన్‌ చేశారని ప్రశ్నించారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న హామీ ఏమైందని అన్నారు. నిరుద్యోగ యువతను మోసం చేసినట్లు కాదా? అన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాలకి పేదలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని ఇచ్చారా? మణిపూర్లో మారణకాండ జరిగితే దానిపై ఎటువంటి చర్యలు తీసుకోని ప్రభుత్వానికి మీరు మద్దతు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలకి చెప్పి చైతన్య వంతులు చేసి కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామని అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అలిమ్ బాబు, కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి కర్రెద్దుల సురేష్, ఎస్‌సి సెల్‌ జనరల్‌ సెక్రటరీ మంకెన మణి బాబు, కాంగ్రెస్‌ మండల యర్రాకుల శ్రీనివాస్ యాదవ్, దేవరకొండ శ్రీను, దామర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️