చెత్త నుండి సంపద సృష్టి

Mar 14,2024 23:46

ప్రజాశక్తి – బాపట్ల
గ్రామాల్లో ఘన వ్యర్ధాల నిర్వహణతో పరిసరాల పరిశుభ్రత తోపాటు చెత్త నుండి సంపద సృష్టించాలని ఎంపీడీఓ పి విజయ శేఖర్ పంచాయతీ సిబ్బందికి గురువారం సూచించారు. మండలంలోని ఈస్ట్ బాపట్ల పంచాయతీలో నందిరాజుతోట సంపద సృష్టి కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో క్లాప్ మిత్రాలు, పారిశుధ్య నిర్వహణలో గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. పంచాయతీ సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికుల జీతభత్యాల చెల్లింపులో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ధ వహించాలని అన్నారు. ఘన, వ్యర్ధాల నిర్వహణపై ఇఓ పిఆర్డి పులి శరత్ బాబు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఈస్ట్ బాపట్ల పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శులు, క్లాప్ మిత్ర, షెడ్డు మిత్ర పాల్గొన్నారు.

➡️