చింతపల్లిలో సిపిఎం, ఆదివాసీ నేతల గృహ నిర్భంధం

cpm leaders arrest in chintapalli on ys jagan visit

ప్రజాశక్తి-పాడేరు:- అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లికి గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి.పి. అప్పల నర్శను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. తెల్ల వారు జామున 3 గంటలకే పాడేరులో ఆయన ఇల్లును పోలీసులు చుట్టూ ముట్టారు. దీనిపై అప్పల నరస ఫోన్లో తన ఇంటి వద్ద నుంచి విలేకరులతో మాట్లాడుతూ తనను గృహ నిర్బంధం చేయడానికి తీవ్రంగా ఖండించారు.  చింతపల్లిలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి ఆదివాసీ నాయకులపై గృహ నిర్భందం సరికాదని అన్నారు. సి.ఎం ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్ పై మౌనం వీడి చట్టబద్ధత కల్పించడంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేయాలని,  ఆదివాసీ మాతృ భాష నేటివ్ స్పీకర్స్ కు జీతాలు పెంచాలని, జాతీయ రహదారి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కాఫీ రైతులకు బకాయి పడ్డ 62 కోట్లు వెంటనే నిధులు విడుదల చేసి రైతులకు చెల్లించాలని పి.వి.టి. జిలకు అంత్యోదయ రేషన్ కార్డులు, 5 లక్షలతో ఇల్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజుని, తదితర నేతలను గృహా నిర్బంధించారు. అనంతగిరి ఎ.ఎస్.ఐ బి.రాజాంనాయుడు, కె.కృష్ణమూర్తి తెలవారు 3 గంటల సమయంలోనే వారిని నిర్బంధించారు. ఈ చర్యలను జెడ్పీటీసీ దీసరి గంగరాజు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు తెలిపారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఎం జగన్ ని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చింతపల్లి పర్యటన సందర్భంగా జీవో నెంబర్ 3 చట్టబత కల్పించి ఆదివాసులకు నూరుశాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పాడేరు ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న గిరిజన ఆశ్రమ, మండల పరిషత్ పాఠశాలల్లో 1500 ఉపాధ్యాయ పోస్టులకు ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని అడిగినందుకు పోలీసులతో హౌస్ అరెస్టు చేశారు.

cpm leaders arrest in chintapalli on ys jagan visit a

cpm leaders arrest in chintapalli on ys jagan visit

చింతపల్లిలో గిరిజనుల హక్కుల కోసం నిలదీస్తారని అల్లూరి జిల్లా సిపిఎం నేత బోండా సన్నిబాబు హౌస్ అరెస్ట్

 

➡️