కౌంట్‌డౌన్‌ షురూ!

ప్రజాశక్తి – కడప ప్రతినిధిసార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. కేంద్ర ఎన్నికల కమి షన్‌ గురువారం ఎన్నికల నగారా మోగించనున్న నేపథ్యంలో జిల్లా అధి కార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌, ఎస్పీ నామినేషన్ల ఘట్టానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వ హణలో మొదటి అంకమైన నామినేషన్ల ఘట్టానికి తెరలేచింది. ఎపిలో మే 13న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 29న నామి నేషన్ల ఉపసంహరణతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. అనంతరం సుమారు నెల రోజులపాటు అభ్యర్థుల ఎన్నికల ప్రచారం నిర్వహిం చుకునే అవకాశం కల్పించనుంది. అనం తరం మే 13న పోలింగ్‌, జూన్‌ నాలు గున నిర్వహించనున్న కౌంటింగ్‌తో ఎన్నికల ఘట్టం ముగియనుంది. జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ముందస్తు ఏర్పాట్లలో నిమగ మయ్యారు. మొదటి విడత కింద ప్రాథ మిక కసరత్తు పూర్తి చేశారు. మరోసారి పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడం గమనార్హం. కడప, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల నమోదు ప్రక్రి యను పూర్తి చేసింది. కడప జిల్లాలో 16,16,509 మంది, అన్నమయ్య జిల్లాలో 14,02,808 మం దితో కూడిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసిం ది. ఉభయ జిల్లాల్లోని 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు ప్రక్రి య దగ్గర నుంచి వివిధ రాజకీయ పార్టీల నాయ కులతో సమావేశాలు నిర్వ హణ, ఎన్నికలకోడ్‌ ఉల్లంఘటన మొద లుకుని ఎన్నికల నిర్వహణకు అవస రమైన అవగాహన కల్పించింది. కడప జిల్లా లోని 2035 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన రిటర్నింగ్‌ అధి కారులు, పర్యవేక్షణ అధికారుల నియామకం ఇతర సెక్యూరిటీ మొదలగు ఏర్పాట్లలో నిమగమైంది. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో టికెట్లు దక్కి ంచుకున్న అభ్యర్థులు నామినేషన్ల తేదీలను ఖరారు చేసుకోవడం, నామి నేషన్లు దాఖలు చేయడం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారాలు మరింత ఊప ందు కునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు పూర్తి స్థాయి లో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అభ్యర్థులు ఎన్నికల ప్రచార వేగం వేగవంతం చేసే అవకాశం కని పిస్తోంది. రాజకీయ పార్టీలు సైతం జిల్లాలోని పెం డింగ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగమైనట్లు తెలుస్తోంది.

➡️