నేటి నుంచి ఫిబ్రవరి 9లోగా కన్వెయన్స్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్స్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దారిద్య్రరేఖకు దిగువున ఉన్న లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇంటి స్థలాలకు కన్వెయన్స్‌ డీడ్‌ ( బదలాయింపు) పేరుతో ”జగనన్న శాశ్వత స్థల హక్కు పథకం” పేరుతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9లోగా ఈ కార్యమ్రాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారయంత్రాంగాన్ని ఆదేశించింది. దీనిలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ నెంబర్‌ 29ని జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులు, గ్రామ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలను జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా గుర్తించింది. ప్రభుత్వం కన్వెయన్స్‌డీడ్‌ ( బదలాయింపు) ప్రక్రియ తప్పులు దొర్లకుండా ఎలా చేయాలనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఆయా నియోజకవర్గాల సబ్‌ రిజిస్ట్రార్లు, గ్రామ, వార్డు సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు, విఆర్‌ఓలు, డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చింది. మార్గదర్శకాలు ఇవే:శ్రీ కన్వేయన్స్‌ డీడ్స్‌ ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల 27నుంచి పిబ్రవరి 9లోగా పూర్తి చేయాలని, జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డిఓ, తహసీల్ధార్లు ప్రాధాన్యతా అంశంగా వేగవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. శ్రీ ఎన్నికల సంఘం తహసీల్ధార్ల బదిలీల ప్రక్రియ ప్రారంభించకమునుపే లబ్ధిదారులకు సంబందించిన డేటా, వివరాలన్నింటికి కలిపి పూర్తి స్ధాయి నివేదికను తయారు చేయాలి. శ్రీ గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని ఎగ్జిక్యూషన్‌ బాధ్యతలను విఆర్‌ఓలు నిర్వహించనున్నారు.శ్రీ రెవిన్యూ విలేజ్‌ల వారీగా గ్రామ సచివాలయాల పరిధిలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లే అవుట్లను పరిశీలించాలి. శ్రీ లబ్ధిదారుల ఆధార్‌ నెంబరు, మొబైల్‌ నెంబరు, బయోమెట్రిక్‌ తప్పని సరి. శ్రీ ప్లాట్లకు సంబంధించి హద్దులను నిర్ధారించాలి.

➡️