నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం :’దాసరిపల్లి’

ప్రజాశక్తి-తంబళ్లపల్లి తనకు ఒక అవకాశం ఇచ్చి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజక వర్గాన్ని పారిశ్రామికంగా, వ్యవసా యపరంగా, అన్నిరంగంలో అభివద్ధి చేసి చూపిస్తానని టిడిపి ఎమ్మెలే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మందలవాండ్లపల్లి పంచాయతీలో జయహో బిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకపారిశ్రామంగా ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారని, హెచ్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ కాలవ ద్వారా చెరువులకు, కుంటలకు నీరు వచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత బిసిలకు చట్టం తేవడం జరుగుతుందని, 50 సంవత్సరాలు నిండిన అర్హులైన బిసిలందరికీ పింఛన్‌ అందిస్తామని నియోజకవర్గ పరిశీలకులు తులసిధర్‌నాయుడు పేర్కొన్నారు. జగనో ్మహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని, నియెజవర్గ నాయకుడు మల్లి కార్జుననాయుడు తెలిపారు. మాజీ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు విశ్వనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బిసిలకు రక్షణ చట్టం, నిరుద్యో గులకు ఉపాధి, అన్నదాతకు ప్రతి సంవత్సరం రూ.20వేలు ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. అనంతరం గిరిజన తాండాలకు చెందిన 50 మంది టిడిపిలో చేరారు. కార్యక్ర మంలో బిసి అధికార ప్రతినిధి త్యాగరాజు, చిన్నికష్ణ, శంకర్‌రెడ్డి, మండల టిడిపి నాయకులు వేణు గోపాల్‌రెడ్డి, బుసిరెడ్డి నాగేశ్వరరెడ్డి, టిడిపి కార్యకర్తలు సాంబా, మోహన, ప్రభాకర్‌రెడ్డి, రామంజులు, పవనకుమార్‌రెడ్డి, రామదాసు నాయిక్‌ పాల్గొన్నారు.

➡️