పుష్ప-2పై బాలీవుడ్‌ దర్శకుడు అభినందనలు

‘పుష్ప ది రూల్‌’పై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనిల్‌శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందన్నారు. తాజాగా టీజర్‌ వీక్షించిన ఆయన ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘ఇప్పుడే ‘పుష్ప 2’ టీజర్‌ చూశా. సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. గతేడాది ఆగస్టు 15న నేను దర్శకత్వం వహించిన ‘గదర్‌ 2’ విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది అదే రోజున విడుదల కానున్న ‘పుష్ప 2′ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ, చిత్ర బృందానికి నా అభినందనలు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ లుక్‌, నటన అత్యద్భుతంగా ఉంది.’ అని పేర్కొన్నారు.

➡️