పాత్రికేయులపై భౌతిక దాడులకు ఖండన

Feb 15,2024 14:03 #srikakulam
Condemnation of physical attacks on journalists

జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కె.సి.చెన్నయ్య
ప్రజాశక్తి-శ్రీకాకుళం : పాత్రికేయులపై బౌతిక దాడులపై మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కె.సి.చెన్నయ్య అన్నారు. రణస్థలం మండల కేంద్రంలో ఒక ప్రేవేటు హోటల్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను ప్రభుత్వాలకు వారసులుగా ఉన్న పాత్రికేయుపై బౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుమాలిన చర్యని ఆరోపించారు. విలేఖరుల పై దాడులు చేయడం వలన వాస్తవాలను, వార్తల్ని ఆపలేరు అని, బెదిరింపులకు పాల్పడితే, దాడులకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. వార్త కథనాలపై ఏమైనా సందేహాలు వుంటే తెలపాలని, లేదా వాటిని ఖండించాల్సిన అవసరం వుంటుంది కానీ ఈ విధంగా భౌతిక దాడులు చేస్తూ, బెదిరింపులకు పాల్పడితే, విలేఖరులను దుషిస్తే ఊరుకునేది లేదని, జర్నలిస్టుల పై దురుసుగా ప్రవర్తించిన వారి ఇంటి ముట్టడి చేస్తామని హెచ్చరించారు. పోలీస్ యంత్రాంగం జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, దాడులు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పాత్రికేయులపై, ప్రతి పక్షాలపై ప్రజాసంఘలపై, ప్రభుత్య ఉద్యోగులు, చివరకు అంగన్ వాడి పర్కిర్స్ పై కక్ష సాధిస్తూ వేధింపులకు గురి చేస్తున్నదని ఆరోపించారు. దళితులకు సంబంధించిన 19 రకాల ప్రభుత్వ పథకాలు రద్దు చేసిందని పేర్కొన్నారు. పేదలకు ఇచిన పట్టాలను ఆక్రమణలకు గరైనా అధికారులు పట్టించుకోకుండా ఆక్రమణ దారులకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఎస్.సి. ఎస్.టి. చట్టాన్ని నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. వైసిపి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో పేదల భూములకు, ఇళ్లకు రక్షణ లేదని అన్నారు. రాష్ట్రంలో ఎస్. సి. ఎస్.టి. బి.సి. మైనారీ లకు, ప్రజా సంఘాల నాయకులకు రక్షణ లేదన్నారు. ముఖ్యంగా పాత్రికేయులు ఎపత్రికలో పనిచేసినా అందరూ ఐక్యమత్యంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో మాల మహానాడు సభ్యులు, కుపులి సీతప్పడు, చిన్నబాబు, సూరపురు క్రిష్ణవేణి, మాజీ సర్పంచ్ నర్సయ్య తదితరులు పాల్గోన్నారు.

➡️