అక్రమ అరెస్టులను ఖండించండి : డివైఎఫ్ఐ

Jan 10,2024 16:46 #DYFI, #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : నిర్బంధాలను ఆపి మెగా డీఎస్సీ వెంటనే విడుదల చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మెగా డీఎస్సీ విడుదల చేయాలని శాంతియుతంగా తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వెళుతున్న వందమందికి పైగా డివైఎఫ్ఐ నాయకులను నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అరెస్టులను ఖండిస్తూ డివైఎఫ్ఐ నాయకులు తో కలిసి ప్రకటన విడుదల చేశారు.ఈసందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చి నేడు మోసం చేశారని విమర్శించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్,రాష్ట్రంలో ఖాళీ పోస్టల భర్తీ,ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ అని నమ్మ పలికి యువతతో ఓట్లు వేయించుకున్నారన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20వేల టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు. మడమ తిప్పని నాయకుడిని మాట అమలు చేయమని అడిగితే ఎందుకు అంత కోపమో మడమ తిప్పని నాయకుడే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడినట్లు చరిత్రలో లేదని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటించలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటను అమలు చేయకుండా నిర్బంధం చేస్తామని, అక్రమ అరెస్టులు చేస్తామని, జైల్లకు తరలిస్తామని కంకణం కట్టుకుంటే నిరుద్యోగ యువత ని గోరికడతారని హెచ్చరించారు. నాయకులు ప్రకాష్, అంజి, రవి ,ఎర్రమల పాల్గొన్నారు.

➡️