దీక్ష కెరీర్ గైడెన్స్ కోర్సును పూర్తి చేయాలి

Apr 10,2024 16:01 #srikakulam
  • ఎఎంఓ లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : TaRL (Teaching at Right Level), LIP (Learning TV Improvement Programme) అమలు తీరును పరిశీలించడానికి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి గుంట.లక్ష్మీనారాయణ ఎచ్చెర్ల మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్.ఎస్.ఆర్ పురం, బుడగట్లపాలెం, ఏపీ మోడల్ స్కూల్ కుప్పిలి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కుప్పిలి పాఠశాలలను సందర్శించి, ఆయా పాఠశాలల్లో TaRL, LIP ఎండ్ లైన్ టెస్ట్ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. దీంతో పాటుగా ఎంపీపీ స్కూల్ కుప్పిలిలో TOEFL పరీక్ష నిర్వహణను కూడా పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దీక్ష ప్లాట్ ఫార్మ్ ద్వారా జిల్లా లోని అన్ని గవర్నమెంట్ మేనేజ్మెంట్ లలో గల అందరు స్కూల్ అసిస్టెంట్ లు, TGT లు, పీజీటి లు, హై స్కూల్ HM లు, మే 1 వ తేదీ లోపు ఈ ఐదు కోర్సులలో విధిగా రిజిస్టర్ అయ్యి..మే 10 వ తేదీ లోపు కోర్సు లను పూర్తి చేసి. సర్టిఫికెట్ లు పొందవలసిందిగా సూచించారు. అలాగే జిల్లా లో గల అన్ని హై స్కూల్స్ లో LIP ఎండ్ లైన్ డాటా ను ఆన్లైన్ లో పొందుపరచల్సిందిగా తెలియజేశారు. ఈయనతో పాటుగా జిల్లా TaRL కోఆర్డినేటర్ G.గొల్ల మరియు HM లు T. జయలక్ష్మి, K. అప్పాజీరావు, P. మోహనరావు, CRP వెంకటరావులు పాల్గొన్నారు.

➡️