సంకిలి ఇఐడి ప్యారి షుగర్‌లో చెరకు క్రషింగ్‌ పూర్తి

  • సంస్థ అసోసియేట్‌ ఉపాధ్యక్షులు పట్టాభి రామ్‌ రెడ్డి వెల్లడి

ప్రజాశక్తి-రేగిడి (విజయనగరం) : మండలంలోని సంకిలి ఇఐడి ప్యారి షుగర్‌లో ఆదివారంతో చెరకు క్రషింగ్‌ పూర్తి అయినట్లు సంస్థ అసోసియేట్‌ ఉపాధ్యక్షులు పట్టాభిరామిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కర్మాగార సమావేశం మందిరంలో విలేకరులతో మాట్లాడుతూ.. 2023-24 ఆర్థిక సంవత్సరం చెరకు క్రషింగ్‌ నాలుగో లక్షల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం కాగా, 3,92,750 లక్షల మెట్రిక్‌ టన్నులు పూర్తిచేసినట్లు వెల్లడించారు. గత ఏడాది 10.02 రికవరీ రాగా ఈ ఏడాది 9.09 రికవరీ వచ్చినట్లు తెలిపారు.. ఈ సీజన్‌ అక్టోబర్‌ 31 ముందుగా క్రషింగ్‌ ప్రారంభించి ఈ నెల 24తో పూర్తి చేసామన్నారు. చెరకు క్రషింగ్‌ విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ ఏడాదికి చెరుకు క్రషింగ్‌కు సహకరించిన రైతులకు, సిబ్బందికి కతజ్ఞతలు తెలిపారు.. వాతావరణం, సాంకేతపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న లక్ష్యాలు పూర్తి చేశామన్నారు.. ఈ ఏడాది చెరకు క్రషింగ్‌ కు ప్రశాంతంగా అయినట్లు వెల్లడించారు .. ప్రభుత్వం ఆదేశాల మేరకు బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి లచ్చయ్యపేట సుగర్స్‌ మూసి వేయడంతో 9,709 మెట్రిక్‌ టన్నుల క్రషింగ్‌ ఆడామన్నారు.. భీమ సింగ్‌ సుగర్స్‌ నుంచి 6,632 మెట్రిక్‌ టన్నుల చెరకును ఆడినట్లు తెలిపారు.. వచ్చే ఏడాది చెరకు క్రషింగ్‌కు 18,000 ఎకరాలు సాగులో ఉందన్నారు. నాలుగు అడుగుల సార్ల మధ్య దూరం 2500 ఎకరాలు సాగులో ఉన్నట్లు తెలిపారు… రైతులు మొక్కజొన్న, వరి వైపు దిష్టి సారించినట్లు తెలిపారు.. గ్రామాల్లో చెరకు పంటలపై అవగాహన కల్పించి చెరుకు సాగు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు… చెరకు సరఫరా చేసిన రైతులకు వెంటనే బిల్లులు చెల్లించామని తెలిపారు. ఈ ఏడాది చెరుకు క్రషింగ్‌ కు సహకరించిన రైతులకు, లారీ,ట్రాక్టర్‌ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు కేన్‌ జిఎం రాజేంద్రన్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ మేనేజర్‌ మురళీకష్ణ, ఫైనాన్షియల్‌ ఏజీఎం శ్యాం కుమార్‌ ఉన్నారు.

➡️