ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు

Nov 27,2023 23:29

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనానికి కేటాయించిన స్థలాన్ని గుడిని పేరుతో కొందరు ఆక్రమించడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ మార్టూరు నేతాజీనగర్ – రామ్ నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో స్పందన ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ పివి రమణకు వినతి పత్రం అందజేశారు. 45సంవత్సరాల క్రితం స్థానిక నేతాజీనగర్ – రాంనగర్ కాలనీలను ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. కాలనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నిర్మించే నిమిత్తం 10సెంట్లు స్థలాన్ని కేటాయించుకున్నట్లు కాలనీ వాసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాలనికి చెందిన గుంటూరు శంకరరావు అనే వ్యక్తి చిన్న గుడి నిర్మించుకోవడానికి కాలనీ పెద్దలను అనుమతి కోరి అక్కడ గుడి నిర్మించాడు. ఇప్పుడు ఆ గుడిని చూపించి అంబేద్కర్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంతో పాటు ప్రక్కనే ఉన్న ప్రభుత్వ ఫోరం బోకు స్థలాన్ని కూడా తప్పుడు డాకుమెంట్స్ సృష్టించి, అధికారులను తప్పుదారి పట్టించి, స్థలం చుట్టూ ఇనుప కంచె నిర్మించి, ఆక్రమించడానికి ప్రయతిస్తున్నట్లు కాలనీ వాసులు వినతి పత్రంలో పేర్కొన్నారు. అధికారులు డాక్యుమెంట్స్ పరిశీలించి కాలనీ వాసులకు న్యాయం చేయాలని కోరారు.

➡️