ధాన్యపు రాశుల దగ్ధంపై ఫిర్యాదు

May 7,2024 13:55
ధాన్యపు రాసులు

ప్రజాశక్తి- తాళ్లరేవు
తాళ్లరేవు మండలం పటవలలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఒక పశువుల పాక, ధాన్యపు రాసులు దగ్ధమైన ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం పటవల నుంచి మంజేరు వెళ్లే దారిలో రోడ్డుపక్క కౌలు రైతు మేడిశెట్టి రాంబాబు, పశువుల పాక ఉంది. అక్కడే 5 ఎకరాల పంట కోసి, రాశులుగా వేశారు. దాని పక్కనే మరో రైతు కోట మాణిక్యం ఎకరం పొలంలోని ధాన్యం రాశి ఉంది. ఆదివారం అర్ధరాత్రి పాక, ధాన్యపు రాశులు అగ్నిలో ఆహుతవుతున్నాయి. అటుగా వెళ్తున్న ఓ పండ్ల వ్యాపారి విషయాన్ని రైతులకు చేర వేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. అప్పటికే పశువుల పాక పూర్తిగా దగ్ధమైపోగా ధ్యానం రాసులు చాలావరకు కాలి బూడిద అయ్యాయి. దీంతో బాధిత రైతులు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. నష్టపరిహారం అందించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు, పటవల మాజీ సర్పంచ్‌ కాల సూరిబాబు, టిడిపి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, నడింపల్లి వినోద్‌, దంగేటి అప్పన్న, పలువురు కౌలు రైతులు వారికి అండగా నిలిచారు. ఫోటో: టి.ఎల్‌.వి.01. కోరంగి పోలీస్‌ స్టేషన్‌ వద్ద విలేకరులకు తమ గోడు వినిపిస్తున్న కౌలు రైతులు.

 

➡️