హంతకులు, నిజాయితీకి మధ్య పోటీ

ప్రజాశక్తి-కాశినాయన/కలసపాడు/పోరుమామిళ్ల/బద్వేలు/అట్లూరుకడప పార్లమెంట్‌ ఎన్నికలు హంత కులు, నీతి నిజాయితీపరుల మధ్య జరుగు తున్నాయని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. శుక్రవారం బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లెలో ఆమె బస్సుయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కలసపాడుకు చేరుకుని సెయింట్‌ పాల్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో బస్సు యాత్ర తొలిరోజు సాగింది. బస్సుయాత్ర సందర ్భంగా షర్మిల మాట్లాడుతూ మా చిన్నాన్న, సోదరి సునీత తండ్రి, మాజీ సిఎం వైఎస్‌ఆర్‌ తమ్ముడు వివేకానందరెడ్డిని గొడ్డలితో హత్య చేసి హింసా త్మకంగా చంపిన వ్యక్తికి సిఎం వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి పార్లమెంట్‌ అభ్యర్థిగా నిలబెడుతు న్నాడని పేర్కొన్నారు. హంతకులను చట్ట సభలకు వెళ్లకుండా చేసేందుకు కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. చిన్నాన్న వివేకా చివరి కోరిక నేను ఎంపీగా పోటీ చేయడమేనన్నారు. అందుకే ఈ రోజు హంతకులకు వ్యతిరేకంగా నిలబడి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వివేకానం దరెడ్డిని చంపి ఐదేళ్లయినా హంతకులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. సాక్షా ధారాలతో ఇటు ప్రజలు అటు సిబిఐ అధికారులు తేల్చినా, అన్ని సాక్షాలు ఉన్నా వివేకానందరెడ్డిని చంపించిన హంతకున్ని జగన్మోహన్‌రెడ్డి ఎందుకు వెంట బెట్టుకుని తిరుగుతున్నాడని ప్రశ్నించారు అలాంటి హంతకులను పార్లమెంట్‌ పంపించేందుకు జగన్‌ సిద్ధపడ్డాడని, వీరిద్దరినీ మనం ఓడిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని పేర్కొన్నారు. హంతకులు జిల్లాను పరిపాలించడం మీకు ఇష్టమా అని ప్రశ్నిం చారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టు పెట్టి ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ కడప స్టీల్‌ ప్లాంట్‌ గాని ఏవి కేంద్రాన్ని అడక్కుండా బిజెపికి తొత్తులుగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ కూడా లేదని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చా రన్నారు. జగన్‌ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాక శంకు స్థాపన చేశారు తప్పితే ఉపయోగం లేదన్నారు. వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ తన తండ్రి వివేకానందరెడ్డి చివరి కోరిక తీర్చేందుకు ముందు వచ్చిన షర్మిలకు ప్రతి ఒక్కరు ఓటు వేయాలన్నారు. వివేకాను చంపింది ఎవరు అనే విషయం బట్టబయలైనా అవినాష్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. హత్య రాజకీయాలు మీకు కావాలా మంచి పరిపాలన మీకు కావాలా అని ప్రజలు తేల్చుకోవాలన్నారు. ఓటు అనే ఆయుధంతో అవి నాష్‌రెడ్డిచాలని కోరారు. పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు చేపట్టి కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే అది మనందరి అదృష్టమని భావిం చాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని వైఎస్‌ఆర్‌ పాలన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బద్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి విజయజ్యోతి మాట్లాడుతూ ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వంలో నియోజ కవర్గం ఏమి అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. భూ కబ్జాలు, ఇసుక మాఫియా, ఎక్కడపడితే అక్కడ దౌర్జన్యాలు తప్ప ఏమి అభివృద్ధి చెందలేదని విమర్శించారు. కార్యక్ర మంలో డిసిసి అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్‌రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమగంపల్లె వల్ల బస్సుయాత్ర సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు.

➡️