కొబ్బరినీళ్లు ఆరోగ్యకరం

Mar 4,2024 10:09 #feachers, #kobbari

కొబ్బరినీళ్ళలో కాల్షియం, ఫాస్‌ఫరస్‌, సోడియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ప్రతిరోజూ గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే ఎండలో శరీరం డీ హైడ్రేషన్‌ కాకుండా కాపాడుకోవచ్చు. కూల్‌డ్రింక్స్‌ కన్నా కొబ్బరినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.

  •  కొబ్బరి నీళ్లల్లో దాహాన్ని తీర్చే గుణం ఉంది. వీటిలో ఉన్న వంటి ఖనిజ లవణాలు రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. ఇందులోని ఎలక్ట్రోలైట్స్‌ తక్షణ శక్తిని నీరసం పోగొడుతుంది.
  •  తక్కువ కొవ్వులు ఉండే కొబ్బరినీళ్లను రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
  •  గర్భిణులకు కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈ సమయంలో వచ్చే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్లు లారిక్‌ యాసిడ్‌ని ఉత్పత్తి చేయడం వల్ల తల్లిపాలు సమృద్ధిగా పడతాయి.
  •  కొబ్బరినీళ్లుఆరోగ్యాన్నే కాదు అందాన్ని పెంచుతాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే విటమిన్‌ బి, విటమిన్‌ సి వల్ల మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌, చర్మం కందిపోవడం, చర్మ సమస్య ఏదైనా సులువుగా పరిష్కరించుకోవచ్చు.
  •  క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్ళను ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల వల్ల వచ్చే మచ్చలు క్రమేనా తగ్గిపోతాయి. చర్మం కూడా తాజాగా, అందంగా మారుతుంది.
  •  ఓ అధ్యయనం ప్రకారం కొబ్బరినీళ్ళలో యాంటీ ఏజింగ్‌ కారకాలు ఉంటాయి. ఇవి వయసును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
➡️