క్లాప్ కలెక్షన్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కచ్చితంగా వసూలు చేయాలి

Nov 23,2023 16:45 #Anantapuram District

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలో ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తోంది పరిసరాలు అపరిశుభ్రంగా మారుస్తున్నాయి పారిశుధ్య మెరుగుపడాలి ఇంటింటి చెత్త సేకరణ క్రమం తప్పకుండా జరగాలి ఇంటింటి చెత్త సేకరణకు గాను క్లాప్ వసూళ్లను కచ్చితంగా చేపట్టాలి అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్లను వేగవంతం చేయాలి లేకుంటే సానిటరీ ఇన్స్పెక్టర్లకు మెమోలు జారీ చేస్తా మీ పని తీరు మెరుగు పడుకుంటే మీ పర్యవేక్షణ అధికారి కార్యదర్శి సంఘం శ్రీనివాసులకు సైతం మేము జారీ చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు గురువారం స్థానికౌన్సిల్ హాలులో సానిటరీ ఇన్స్పెక్టర్లతో సచివాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కమిషనర్ భాగ్యలక్ష్మి కార్యదర్శి సంఘం శ్రీనివాసులు ఈ ఈ సూర్యనారాయణ పాల్గొన్నారు కమిషనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ క్లాప్ వసూళ్లలో సచివాలయాల వారిగా చూస్తే ఆశించిన స్థాయిలో జరగటం లేదన్నారు కచ్చితంగా వసూలు చేయాలని డిఎంఏ నుంచి ఒత్తిళ్లు పెరిగాయి అన్నారు ఇంతవరకు ఉపేక్షించాం ఇకపై ఎవరిని వదిలేది లేదు క్లాప్ వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని వారికి మెమోలు జారీ చేయడం జరుగుతుందన్నారు అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్లను సైతం వేగవంతం చేయాలన్నారు 100% వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలన్నారు వసూళ్ల లక్ష్యాన్ని సాధించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు అలాగే సానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుధ్యం మెరుగుపరిచే విషయంలోనూ క్లాప్ వసూళ్ల లక్ష్యంలోనూ అశ్రద్ధ వహిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగు పడుకుంటే సానిటరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ అధికారి కార్యదర్శి సంఘం శ్రీనివాసులకు సైతం మెమో జారీ చేస్తామని స్పష్టం చేశారు చెత్తకుండీల వద్ద చెత్త తొలగించిన తర్వాత దుర్గంధం వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ , సున్నము కలిపి చెల్లించాలన్నారు శానిటేషన్ మెరుగుపరచడంతోపాటు మురుగు కాలువలు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించటం ఏవైనా పారిశుధ్య సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు

➡️