ప్రారంభమైన క్రిస్మస్ క్యారల్స్

Dec 2,2023 01:02

ప్రజాశక్తి – చిన్నగంజాం
క్రిస్మస్ పండుగ సందర్భంగా స్థానిక అంబేద్కర్ నగర్‌ శుక్రవారం తెల్లవారు జామున 4గంటలకు క్రిస్మస్ క్యారల్స్ ప్రారంభించారు. విశ్రాంత సైనిక ఉద్యోగి అల్లాడి సుబ్బారావు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె కుమారి, మనవడు నవీన్ సండే స్కూల్ చిన్నారులకు, యువతీ యువకులకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. మేడికొండ జయపాల్ జ్ఞాపకార్థం వారి కుమార్తె సంతోషం, కుటుంబ సభ్యులు చిన్నారులకు క్యాండిల్స్, టీ బిస్కెట్స్ అందజేశారు. కార్యక్రమంలో క్రిస్మస్ క్యారల్స్ నిర్వాహకుడు మేకల మేషక్ బాబు, జి చందుసాగర్, వాలంటీరు మార్పు మహేష్, మేడికొండ సునీల్, జి శ్వేత, మార్పు బాబి పాల్గొన్నారు.

➡️