మహర్షి రాఘవకు చిరంజీవి సత్కారం

హీరో చిరంజీవి తన పేరుతో బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించి 26 సంవత్స రాలైంది. ప్రారంభం నుంచి రక్తదానం చేసే వారిలో నటుడు మహర్షి రాఘవ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన వందసార్లు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను మెగాస్టార్‌ అభినందించారు. ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి సత్కరించారు. ఆయన సేవలను చిరంజీవి కొనియాడారు. రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ రాఘవను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి దాతల వల్లే ఎంతోమందికి రక్తం అందిస్తున్నామని తెలిపారు.

➡️