5 నుంచి కూటమి తరపున చిరంజీవి ప్రచారం

Apr 29,2024 14:39 #chirajeevi

విజయవాడ : సినీహీరో చిరంజీవి ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మే 5 నుంచి 11వ తేదీ వరకూ జరిగే ప్రచారాల్లో ఆయన పాల్గొంటారు. అయితే ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా అప్పటి కాంగ్రెస్‌ కేంద్ర పాలకులు ఆయనకు కేంద్రమంత్రి పదవిని సైతం కట్టబెట్టిన విషయం విధితమే. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మారిన తర్వాత గత కొన్నేళ్లుగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమంలో పాల్గనకపోయినా కొన్నాళ్లు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ప్రస్తుత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.  కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున కూటమి అభ్యర్థి కె.పవన్‌కళ్యాణ్‌ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఆయన తరపున ఎన్నికల ప్రచారం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా బలం ఉన్న అభ్యర్థులకే చిరంజీవి ప్రచారానికి వస్తున్నారనే గుసగుసలు కూడా బాగానే వినిపిస్తున్నాయి.

➡️