స్ప్రే సిలిండర్ పేలి చిన్నారి మృతి

Dec 14,2023 08:23 #Fire Accident, #Tirupati district
స్ప్రే సిలిండర్ పేలి చిన్నారి మృతి

ప్రజాశక్తి-పుత్తూరు : స్ప్రే సిలిండర్ పేలి చిన్నారి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం వద్ద గల జి.వి.అర్ కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం పెండ్లి నిర్వహణకు డెకరేషన్ నిమిత్తము తీసుకువచ్చిన 4కేజీ స్ప్రే సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో కసింమిట్ట గ్రామం నారాయణకి చెందిన చాందిని అనే 11 సంవత్సరాల చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. పుత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర గాయాలైన చాందిని మృతి చెందింది.

➡️