మహిళలకు అగ్రస్థానం ఘనత ముఖ్యమంత్రి జగన్‌ దే..

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అగ్రస్థానం కల్పించారని మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం తూర్పు పాలెం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రంగనాథరాజు ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమానికి రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిల రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. నామినేటెడ్‌ పదవుల్లోనూ మహిళలకు సగ భాగంగా చిత్తశుద్ధితో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. అదే విధంగా ప్రతి సంక్షేమ పథకం లబ్ధి మహిళల ఖాతాల్లోకి చేరేలా జమ చేశారన్నారు. మహిళలు సద్వినియం చేసుకొని ఆర్థిక పరిపుష్టి పొందాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు పసందైన విందుతో భోజనం పెట్టి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాయ మాటలు నమ్మి మోసపోవద్దని రంగనాథరాజు హితవు పలికారు. మహిళలకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చిల్లే లావణ్య పెనుమంట్ర జడ్పిటిసి కర్రీ గౌరీ సుభాషిని, సర్పంచులు ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌, దండు పద్మావతి, ఏపీ ఉమెన్స్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌, బొక్క అరుణ, సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు, జక్కం శెట్టి చంటి, మట్టా కుమారి, తదితరులు పాల్గొన్నారు.

➡️