పొద్దున్నే
కోడిపుంజు
కొక్కొరోకోమని
కూత కూసింది
చిట్టి టక్కుమని
నిద్ర లేసింది
పుస్తకం తెరిసింది
టక టక చదవ సాగింది
చక చక తయారయ్యింది
బడికి వెళ్ళింది
చిట్టి బడిలో
తోటి వాళ్లతో
స్నేహానికి చేయి చాచింది !
కోడిపుంజు ఊరిలో
తోటి పుంజులతో
కయ్యానికి కాలు దువ్వింది !
చిట్టి స్నేహితులకు
దగ్గరయ్యింది
కోడిపుంజు
శత్రువులకు దూరమయ్యింది
చిట్టి బడిలో
పాఠం నేర్చుకుంది.
కోడిపుంజు ఊరిలో
గుణపాఠం నేర్చుకుంది!
– అమ్మిన వెంకట అమ్మిరాజు, పేరూరు, తెలంగాణ,94407 08656.