చెన్నై ఎగ్మోర్‌, హతియాకు వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 24,2024 10:13 #chennai, #special trains, #Summer

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్‌, విశాఖపట్నం-హతియా మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. 08557 విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్‌ వేసవి ప్రత్యేక రైలు ఈనెల 27 నుండి వచ్చేనెల 29 వరకు ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు చెన్నై ఎగ్మోర్‌ చేరుకుంటుంది. 08558 చెన్నై ఎగ్మోర్‌, విశాఖపట్నం వేసవి ప్రత్యేక రైలు ఈనెల 28 నుండి వచ్చేనెల 30 వరకు ప్రతి ఆదివారం ఉదయం 10.30 గంటలకు చెన్నై ఎగ్మోర్‌ నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 22.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖ, చెన్నరు ఎగ్మోర్‌ మధ్య పది ట్రిప్పులు నడిచే ఈ రైళ్లుదువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు గూడూరు మీదుగా ప్రయాణిస్తాయి. 08555 విశాఖపట్నం, హతియా వేసవి ప్రత్యేక రైలు ఈనెల 28 నుండి వచ్చేనెల 30 వరకు ప్రతి ఆదివారం రాత్రి 23.50 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 14.35 గంటలకు హటియా చేరుకుంటుంది. 08556 హటియా,విశాఖపట్నం వేసవి ప్రత్యేక రైలు ఈనెల 29 నుండి జూన్‌ ఒకటో తేదీ వరకు ప్రతి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు హటియాలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ, మునిగూడ, కేసింగ, టిట్లాగఢ్‌, బలంగీర్‌, బర్గర్‌, సంబల్‌పూర్‌, ఝర్సుగూడ రూర్కెలా మీదుగా ప్రయాణిస్తాయి.

పలు రైళ్ల రద్దు/ దారి మళ్లింపు
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల దృష్ట్యా 17243 గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌, 17267 కాకినాడ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌, 17268 విశాఖపట్నం-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ లను ఈనెల 29 నుండి వచ్చేనెల 26 వరకు, 17244 రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 30 నుండి వచ్చేనెల 27 వరకు రద్దు చేసారు.
దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా 22643 ఎర్నాకులం-పాట్నా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 29 వచ్చేనెల 6, 13, 20 తేదీలలో, 12509 ఎస్‌ఏంవి బెంగళూరు-గౌహతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేనెల 1, 3 , 8, 10, 17, 22, 24 తేదీలలోనూ, 11019 సిఎస్‌టి ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 29, మే 1, 3, 4, 6, 8, 10, 11, 13, 15, 17, 18, 20, 22, 24, 25 తేదీల్లో సాదారణ మార్గమైన విజయవాడ- ఏలూరు- నిడదవోలు మీదుగా కాకుండా విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్‌- నిడదవోలు మీదుగా మళ్లించబడిన మార్గంలో నడుస్తాయి. అదేవిధంగా 18111 టాటా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ టాటాలో వచ్చేనెల 2, 9, 16 23 తేదీలలో, 12376 జసిదిV్‌ా-తాంబరం ఎక్స్‌ప్రెస్‌ వచ్చేనెల 1, 8, 15,22, తేదిలలో 22837 హటియా-ఎర్నాకులం ఏసీ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 29, వచ్చేనెల 6 , 13, 20 తేదీలలో, 18637 హటియా-ఎస్‌ఏంవి బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 30, వచ్చేనెల 5, 7, 12, 14, 19, 21 26 తేదీలలో, 12889 టాటా నగర్‌- ఎస్‌ఏంవి బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వచ్చేనెల 3, 10, 17, తేదీలలో , 13351 ధన్‌బాద్‌-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 29 నుండి వచ్చేనెల 26 వరకు సాధారణ మార్గం అయిన నిడదవోలు-ఏలూరు-విజయవాడ మీదుగా కాకుండా మళ్లించిననిడదవోలు-భీమవరం టౌన్‌-గుడివాడ-విజయవాడ మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయని ఈస్ట్‌కోస్టు రైల్వే అధికారులు వెల్లడించారు..

➡️