చీకటి జీవోలుతో రైతులను మోసం

Feb 12,2024 12:20 #anakapalle district
Cheating farmers with dark creatures

దీనికి మూల్యం తేల్లించక తప్పదు సిపిఎం

ప్రజాశక్తి-దేవరాపల్లి : మాడుగుల నియోజకవర్గంలో పెద్దెరు రిజర్వేయరు ఎడమ కాలువ పనులు అదుణికరణ కొరకు 84,4 కోట్లు రూపాలతో అబివృద్ది చేస్తామని 9,50 కోట్లతో కుడి కాలువ 4 LA ద్వారా ఎల్ గంగవరం ఓండ్రువీది ఎల్ క్రిష్ణపురం గదబవీది పాత గవరవరం కాకం కోట కోండ్లపాడు కోండవీది గిరిజన గ్రామాలకు అసంపూర్తిగా నిలిచిపోయి కాలువ పనులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని చీకటి జీవోలు తీసుకొచ్చి రైతులను మోసం చేస్తారా! దీనికి తగిన మూల్యం చేల్లింకతప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న హెచ్చరించారు సోమవారం అయిన ఓప్రకటన విడుదల చేశారు. పెద్దెలు ఎడమ కాలువ పనులు అబివృద్దికి 84,4 కోట్లుతో అబివృద్ది చేస్తామని ఉపముఖ్యమంత్రి బూడిముత్యాలు సమక్షంలో 16/3/2023 న జివో నెంబరు 120 తీసుకు వచ్చారని నేటికీ పది నెలలుగా ఎందుకు పనులు ప్రారంభించలేదని వెంకన్న ప్రశ్నించారు. సకాలంలో పనులు జరిగి ఉంటే ఈ సంవత్సరం వర్షాలు సక్రమంగా లేనందున మేయిన్ కెనాల్ ద్వారా రీపర్ చేసి, రావికమతం మండలం లోని 16 గ్రామాలకు గాను 4,110,12 ఎకారాలకు సాగునీరు అంది ఉండేది, అలా చేయక పోవడం వలన పంటపోలాలు బీడు బారి పోయాయని  తెలిపారు. వీటితో అసంపూర్తిగా నిలిచిపోయిన కాలువ ద్వారా గిరిజనులకు సాగు నీరు అందక పోవడంతో రెండు వేలు ఎకారాలకు నష్టం జరిగిందని తెలిపారు. పది నేలలు క్రితం విడుదల చేసిన చీకటి జీవోలకు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదని కుంటు షాకులు చెప్పి రైతులను మోషం చేసారని ఇది అత్యంత దుర్మార్గమైన చర్యని దుయ్యబట్టారు. ఇది ఓక్కటే కాదని రైవాడ రైతులకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందిస్తామని నమ్మ బలికి మోసం చేసారని దీని వలన రైవాడ చిన సోంపురం పేదసోంపురం పేదలుకు వందలాది ఎకారాలు పోలాలు ఎండి పోయాయని ఇటువంటి మోషపూరితమైన ప్రకటనులు వలన రైతులు తగిన గనపాఠం చెబుతారని తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలో,రైవాడ ఇసుక గెడ్డ పాలగెడ్డ గోర్రిగెడ్డ తారకరామా పెద్దెరు మరి ఎన్నో ప్రాజెక్టులు ఉన్న ముంత్రి గారి నిర్లక్ష్యంతో ఎటు వంటి అబివృద్ది చేందకుండా ఉండి పోయాయని తెలిపారు. ఈప్రాజెక్టులకు ఈప్రభుత్వం హయాంలో ఓక్కరూపాయి కూడా ఖర్చు చేయ లేదన్నారు. సోంతమండలంలోని కామాదేనువు లాంటి రైవాడ రీజర్వేయరును పూర్తిగా నాశనం చేసారని తెలిపారు. మంత్రి బూడిముత్యాలు నాయుడు జిల్లా కలెక్టర్ సమక్షంలో 220 కోట్లుతో హైడ్రాలిక్ గేట్లుతో రైవాడ ప్రాజెక్టును అబివృద్ది చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరా లెదన్నారు. పెద్దెరు ఆదుని కరణకు ప్రభుత్వ తెచ్చిన జి ఓ నెంబరు 120 కి విలువ ఉందా! లేదా! ఉంటే ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో రైతులకు సమాదానం చెప్పాలని వెంకన్న డిమాండ్ చేసారు.

➡️