సిబిఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు

న్యూఢిల్లీ : సిబిఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల డేట్‌ షీట్‌ను బోర్డు ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే. అయితే.. ఈ టైం టేబుల్‌ లో అధికారులు కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్‌ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్‌ చేసిన పరీక్షల తేదీలను తాజాగా బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు సిబిఎస్‌ఈ వెబ్‌ సైట్‌లో చూసుకోవచ్చని వెల్లడించింది.

10వ తరగతి షెడ్యూల్‌లో … ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్‌ పేపర్‌ ఫిబ్రవరి 28వ తేదీకి మారింది. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్‌, ఫ్రెంచ్‌ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్‌, ఫిబ్రవరి 23న టిబెటన్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక, 12 వ తరగతిలో కేవలం ఫ్యాషన్‌ స్టడీస్‌ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు.

పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని సిబిఎస్‌ఈ బోర్డు తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్‌ ఇవ్వడంతోపాటు జేఈఈ మెయిన్‌ వంటి పోటీ పరీక్షలను దఅష్టిలో ఉంచుకొని ఈ డేట్‌ షీట్‌లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్‌ డాక్టర్‌ సన్యం భరద్వాజ్‌ గతంలో వెల్లడించారు.

సిబిఎస్‌ఈ 10వ తరగతి రివైజ్డ్‌ టైం టేబుల్‌..

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ కోసం లింక్ పై క్లిక్‌ చేయండి

https://www.cbse.gov.in/cbsenew/documents/DATE_SHEET_CLASS_XII_Revised_03012024.pdf

➡️