చంద్ర కక్ష్య నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ : ఇస్రో 

Dec 5,2023 14:41 #Chandrayaan-3, #ISRO

 న్యూఢిల్లీ :    చంద్రయాన్‌ -3 ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ కక్ష్యను విజయవంతంగా మార్చామని ఇస్రో మంగళవారం ప్రకటించింది. చంద్రుడి కక్ష్య లో ఉన్న మాడ్యూల్‌ ను భూకక్ష్యలోకి తీసుకొచ్చే అరుదైన ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది. ఇందుకు గాను ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్‌-ఎర్త్‌ ఉత్తేజిత ప్రక్రియ వినియోగించినట్లు తెలిపింది.   జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జిటిఒ) నుండి చివరి చంద్ర ధ్రువ వృత్తాకార కక్ష్యకు ల్యాండర్‌ మాడ్యూల్‌ను మార్చడం మరియు ఉద్దేశించిన విధంగా విభజనను విజయవంతంగా సాధించడం ద్వారా ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ (పిఎం) ప్రధాన లక్ష్యం నెరవేరిందని ఇస్రో వెల్లడించింది. విభజన తరువాత ఇస్రో పిఎం లోపల హాబిటబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌ (ఎస్‌హెచ్‌ఎపిఇ) పెలోడ్‌ స్పెక్ట్రోపోలారిమెట్రీని నిర్వహించిందని ప్రకటించింది.

వాస్తవానికి ఎంపి మిషన్‌ను మూడు నెలల ఆపరేషన్‌ కోసం నిర్ణయించారు. ఒక నెల కంటే ఎక్కువ సమయం మాత్రమే పనిచేయడంతో 100 కిలోల ఇంధనం మిగిలిపోయిందని తెలిపింది. మిగులు ఇంధనాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో చంద్రయాన్‌ మిషన్‌ల కోసం అదనపు డేటాను సేకరించేందుకు మరియు భవిష్యత్‌ నమూనా రిటర్న్‌ మిషన్‌ల కార్యాచరణను రూపొందించేందుకు దీనిని వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు ఇస్రో ప్రకటించింది

. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 లోని  విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా చంద్రుడి దక్షిణ దృవంపై   ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే.

➡️