చంఢగీఢ్‌ మేయర్‌ రాజీనామా

Chandigarh mayor resigns

చండీగఢ్‌ : చంఢగీఢ్‌ మేయర్‌గా ఎన్నికైన మనోజ్‌ సొంకార్‌ ఆదివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ముగ్గురు ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు బిజెపిలో చేరిపోయారు. మనోజ్‌ సొంకార్‌ ఎన్నికకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా మనోజ్‌ రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు. జనవరి 30న చంఢగీఢ్‌ మేయర్‌ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌, ఆప్‌ కౌన్సిలర్లకు చెందిన ఏడు ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బిజెపి అభ్యర్థి మనోజ్‌ సొంకార్‌ విజయం సాధించినట్లుగా అధికారులు ప్రకటించారు. చెల్లని ఓట్లుగా ప్రకటించడం కోసం ప్రతిపక్ష కౌన్సిలర్ల బ్యాలెట్‌ పత్రాలపై ఎన్నికల అధికారి పిచ్చి గీతలు పెడుతున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల అక్రమాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆప్‌ ఆశ్రయించింది. గత విచారణలో ఈ ఎన్నికను ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా’ సుప్రీంకోర్టు విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సోమవారం జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రిసైడింగ్‌ అధికారిని ఆదేశించింది.

 

➡️