చందా కొచ్చర్‌కు సుప్రీంలో నిరాశ

Dec 8,2023 22:29 #Business
chanda kochhar

న్యూఢిల్లీ : క్విడ్‌ప్రోకో కేసులో ఇరుక్కున్న ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ సిఇఒ చందా కొచ్చర్‌కు తాజాగా సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటూ.. కోర్టుల చుట్టు తిరుగుతున్న ఆమెకు తాజాగా తన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన అప్పీల్‌ను స్వీకరించడానికి అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం నిరాకరించింది. ఈ ఏడాది మే నెలలో ఐసిఐసిఐ బ్యాంక్‌ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలను కోరుతూ ఆమె చేసిన మధ్యంతర దరఖాస్తును తిరస్కరించిన బాంబే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.

➡️