జనవరి 12న చలో పార్లమెంట్

Jan 6,2024 00:27

ప్రజాశక్తి – రేపల్లె
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు ఐక్య సంఘటనగా ఏర్పడి చలో పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్‌కుమార్‌ తెలిపారు. ఛలో పార్లమెంట్‌ కరపత్రాలను శుక్రవారం ఆవిష్కరించారు. కేంద్రంలో రెండోసారి అధికారానికి వచ్చిన బిజెపి జాతీయ విద్యా విధానం 2020తీసుకొచ్చి విచారంగంలో సమూల మార్పులు చేస్తుందని అన్నారు. దీనివల్ల పేదలకు ప్రభుత్వ విద్య దూరం అవుతుందని అన్నారు. విద్యను విదేశీ సంస్థలకు, కార్పొరేషన్ శక్తులకు అప్పగించేందుకు దోహదపడుతుందని అన్నారు. దీనిని దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ఉన్నత విద్యలో అనేక రకమైన మార్పులు చేసి సెంట్రల్ యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ సంస్థల్లో పని చేస్తున్న వ్యక్తులను విసీలుగా, ప్రొఫెసర్లుగా నియమిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలను ఆర్ఎస్ఎస్ సంస్థలకు అడ్డాగా, మత సంస్థలుగా మార్చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ యూనివర్సిటీలను దేశంలోకి ఆహ్వానిస్తూ చేసిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇలాంటి అంశాలపై పార్లమెంట్ మార్చి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివశంకర్, రేపల్లె కార్యదర్శి సూర్య ప్రకాష్, హేమ, నాగశ్రీ పాల్గొన్నారు.

➡️