కేంద్ర వైఖరిపై కర్ణాటక నిరసన

chalo-delhi-siddaramaiah-karnataka-ministers-protest-at-jantar-mantar-against-centre

రాజధానిలో ఆందోళన

న్యూఢిల్లీ : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా చెల్లించే విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తోందని ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు మండిపడ్డాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్ర వైఖరిపై గళం విప్పగా తాజాగా కర్నాటక కూడా గొంతు కలిపింది. కర్నాటకకు 15వ ఆర్థిక సంఘం చేస్తున్న అన్యాయంపై ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బుధవారం రాజధాని న్యూఢిల్లీలో ఆందోళన నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం వైఖరి కారణంగా రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాల్లో రూ.1,87,000 కోట్ల నష్టం వాటిల్లిందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల విలేకరుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలో నీటి పారుదల, అభివృద్ధి ప్రాజెక్టుల అమలులో కేంద్రం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా 4.71% నుండి 3.64%కి తగ్గిందని గుర్తు చేశారు. దీనివల్ల పన్నుల్లో రూ.62,098 కోట్లు నష్టపోయామని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

➡️