పారదర్శకంగా కులగణన

Nov 23,2023 09:37 #Caste Census
caste census in ap

గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అడిషనల్‌ డైరెక్టరు ధ్యానచంద్ర
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా జరగాలని, అందుకు తగ్గట్లు ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అడిషనల్‌ డైరెక్టరు ధ్యానచంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన కులగణన పైలెట్‌ సర్వేపై విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానచంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సర్వే కోసం శ్రీకాకుళం, అంబేద్కర్‌ కోనసీమ, ఎన్‌టిఆర్‌, నెల్లూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాల నుంచి ఒక్కో సచివాలయాన్ని ఎంపిక చేసి పైలెట్‌గా సర్వే చేయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రూపొందించిన యాప్‌లో సర్వే కోసం అన్ని రకాల ప్రశ్నలను చేర్చడంతోపాటు ఇకెవైసి నమోదు చేయాలన్నారు. సర్వే సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి గుర్తింపు కోసం ఫేషియల్‌, ఒటిపి, వేలిముద్రలు, ఐరీష్‌ సౌకర్యాలను కల్పించినట్లు వివరించారు. సమీక్షా సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టరు జెవి మురళీ, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ డిజిటల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఛార్జి రామ్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️