ఒంటి కాలిపై నిలబడి రాజధాని రైతుల నిరసన

Apr 20,2024 16:30 #tullur

ప్రజాశక్తి – తుళ్లూరు : వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేసిందంటూ శనివారం రాజధాని ప్రాంతం వెంకటపాలెం రైతులు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు.రైతు దీక్షా శిబిరం వద్ద ఉదయం గం 12 నుంచి గం 1 వరకు ఒంటి కాలిపై నిలబడ్డారు. అప్పు చేసి పప్పు కూడు.. అభివఅద్ధి కుంటుబడి రాష్ట్రం దివాళా.. అభివఅద్ధి – సంక్షేమం కొనసాగించి భావితరాల భవిష్యత్తు కు భరోసా నిచ్చే నాయకుడిని ఎన్నుకుందాం..అంటూ రైతులు,మహిళా రైతులు నినాదాలు చేశారు.విజన్‌ ఉన్న నాయకుడిని ఓటు వేసి గెలిపించు కుందామన్నారు.కాగా రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు,మహిళా రైతులు,రైతు కూలీలు చేస్తున్న దీక్షలు శనివారంతో 1587 వ రోజుకు చేరాయి.తుళ్లూరు,నెక్క ల్లు,మందడం,అనంతవరం,వెంకటపాలెం తదితర గ్రామాల్లో దీక్షలు సాగాయి.అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కొవ్వొత్తులు వెలిగించి జై అమరావతి,బిల్డ్‌ అమరావతి – సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినదించారు.

➡️